నర్సింహులపేటలో ఉద్రిక్తత
మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావును తొర్రూర్ నుండి అరెస్టు
కాకతీయ,నర్సింహులపేట : నర్సింహులపేట మండల కేంద్రంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావును తొర్రూర్ నుండి అరెస్టు చేసి నరసింహుల పేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషనుకు తరలించారు.
ఈ సందర్భంగా (బీఆర్ఎస్) నాయకులు పోలీస్ వాహనాన్ని అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. మాజీ మంత్రిని అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ నినాదాలు చేసి చేశారు.పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చిన పోలీసులు వాహనాన్ని అక్కడి నుండి ముందుకు తరలించారు. కొద్దిసేపటి క్రితం మాజీ ఎంపీ మహబూబాబాద్ జిల్లా టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత పోలీస్ స్టేషన్కు వచ్చి దాయకరావును పరామర్శించారు.పోలీస్ స్టేషన్ నందు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు తరలివచ్చారు.



