epaper
Wednesday, January 28, 2026
epaper

మేడారంలో ఉద్విగ్నం

మేడారంలో ఉద్విగ్నం
తల్లి రాక కోసం జంపన్నవాగు వద్ద లక్షల మంది ఎదురుచూపులు
పూన‌కాల‌తో హోరెత్తుతున్న మేడారం..!

కాక‌తీయ‌, మేడారం బృందం : మేడారం మహాజాతర తొలి రోజైన బుధవారం రాత్రి వేళ మేడారం అరణ్యం ఉత్కంఠభరిత వాతావరణంతో ఉప్పొంగిపోయింది. గంట గంటకూ భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో అడవీ మార్గాలన్నీ జనసంద్రంగా మారాయి. వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన వాహనాలతో పార్కింగ్ ప్రాంతాలు పూర్తిగా నిండిపోయాయి. ఎటుచూసినా భక్తజన సందడి తప్ప మరో దృశ్యం కనిపించని పరిస్థితి నెలకొంది. కన్నెపల్లి నుంచి సారలమ్మ (సారక్క) తల్లిని గద్దెపైకి తీసుకువచ్చే కీలక ఘట్టం సమీపించడంతో జంపన్నవాగు పరిసర ప్రాంతాల్లో భక్తులు భారీగా మోహరించారు. తల్లి రాకను ప్రత్యక్షంగా దర్శించుకోవాలన్న తపనతో వేలాది మంది భక్తులు గంటల తరబడి నిరీక్షించారు. జంపన్నవాగు ఒడ్డున భక్తుల గుంపులతో పరిస్థితి మరింత ఉద్విగ్నంగా మారింది. డప్పుల చప్పుళ్లు, కొమ్ము బూరల నాదాలతో మేడారం పరిసరాలు మార్మోగాయి. శివసత్తుల పూనకాలతో భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు. కొందరు భక్తులు నాటుకోళ్లు, గొర్రె పొట్టేళ్లతో మొక్కులు చెల్లించేందుకు సిద్ధంగా ఉండగా, మరికొందరు బెల్లం సమర్పణకు ఏర్పాట్లు చేసుకున్నారు. అడవంతా భక్తి, ఉత్సాహం, ఆధ్యాత్మిక పరవశంతో నిండిపోయింది. భారీ రద్దీని నియంత్రించేందుకు పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. క్యూలైన్లను క్రమబద్ధీకరించడంతో పాటు, డ్రోన్ కెమెరాల ద్వారా భక్తుల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు మార్గ మళ్లింపులు అమలు చేస్తూ, భక్తులకు తరచూ సూచనలు ఇస్తున్నారు. తెలంగాణ పోలీస్ శాఖ సోషల్ మీడియా ద్వారా రద్దీ, ట్రాఫిక్ పరిస్థితులపై అప్‌డేట్స్ విడుదల చేస్తోంది. మొత్తానికి, సారలమ్మ గద్దెపైకి చేరే కీలక ఘట్టానికి మేడారం అరణ్యం ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. తల్లి దర్శనంతో జాతర మరింత వైభవంగా మారనుందని భక్తులు విశ్వసిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మరికొద్ది నిమిషాల్లో సారలమ్మ గద్దెపైకి…

మరికొద్ది నిమిషాల్లో సారలమ్మ గద్దెపైకి… – భక్తులకు వేగవంతమైన దర్శనం కాకతీయ, మేడారం బృందం...

విశ్వబ్రాహ్మణ యూత్‌కు నూతన నాయకత్వం

విశ్వబ్రాహ్మణ యూత్‌కు నూతన నాయకత్వం హనుమకొండ జిల్లా యూత్ అధ్యక్షుడిగా అమ్మోజు సురేష్ సంఘ...

గద్దెలపైకి వనదేవతలు.. గాల్లోకి ఎగురుతున్న నాటుకోళ్లు

గద్దెలపైకి వనదేవతలు.. గాల్లోకి ఎగురుతున్న నాటుకోళ్లు ఆదివాసీ విశ్వాసానికి ప్రతీకగా ఎదురుకోళ్ల సంప్రదాయం కాక‌తీయ‌,...

సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తులకు మెరుగైన వైద్య సేవలందించాలి…

సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తులకు మెరుగైన వైద్య సేవలందించాలి... డాక్టర్ బి.రవీంద్ర నాయక్...

మేడారంలో మారుతున్న ప్రసాద పరంపర!

మేడారంలో మారుతున్న ప్రసాద పరంపర! బెల్లం స్థానంలో లడ్డు.. భక్తుల్లో సందేహాలు ఇప్పపువ్వు పేరుతో...

మేడారంలో తప్పిపోయిన భక్తుల కలవరం

మేడారంలో తప్పిపోయిన భక్తుల కలవరం రోజురోజుకూ పెరుగుతున్న గల్లంతులు.. ఆందోళనలో కుటుంబాలు ప్రకటనలకే పరిమితమైన...

సెల్..హెల్‌..

సెల్..హెల్‌.. మేడారంలో మొబైల్ నెట్‌వర్క్‌లు ఫెయిల్! భక్తులు–మీడియా ప్ర‌తినిధుల‌కు తీవ్ర ఇబ్బందులు జియో పూర్తిగా డౌన్..ఎయిర్‌టెల్,...

జిల్లా మారితే నేనే ఎన్నికలకు దూరం

జిల్లా మారితే నేనే ఎన్నికలకు దూరం జయశంకర్ జిల్లాపై దుష్ప్రచారం మానుకోండి! అబద్ధాల పుట్టు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...
spot_img

Popular Categories

spot_imgspot_img