epaper
Saturday, November 15, 2025
epaper

కాంగ్రెస్ కు బుద్ధి చెప్పండి

  • జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ జైత్ర‌యాత్ర‌
  • కుడిచేత్తో ఇచ్చి ఎడమచేత్తో తీసుకుంటున్నారు.
  • మోసాన్ని మోసంతోనే జ‌యించాలి
  • రెండేళ్ల‌లో రేవంత్ ఒక్క ఇటుక పేర్చ‌లే..
  • బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే సమయం వచ్చిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ జైత్రయాత్ర ప్రారంభం అవుతుందని చెప్పారు. మోసాన్ని మోసంతోనే జ‌యించాల‌ని కేటీఆర్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్‌పేట్ డివిజన్ బీజేపీ పార్టీ మాజీ అధ్యక్షుడు తోట మహేష్ ముదిరాజ్, తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా తోట మ‌హేష్‌తో పాటు ఆయ‌న అనుచ‌రుల‌కు కేటీఆర్ గులాబీ కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. అనంత‌రం కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణలోని గరీబోళ్లు, కార్మికులు, రైతులు అందరూ జూబ్లీహిల్స్‌ వైపు చూస్తున్నారని, జైత్రయాత్ర ఇక్కడి నుంచే ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. వచ్చే నెల 11న జరిగే పోలింగ్‌లో బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని ఆయన కోరారు. “మీ ఓటు తెలంగాణ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కేసీఆర్‌ పాలనలో సాధించిన అభివృద్ధిని కాపాడుకుందాం” అని ఆయన పిలుపునిచ్చారు.

అన్నీ మోసాలే..

మేనిఫెస్టోను రాజకీయ పార్టీలకు పవిత్ర గ్రంథంగా భావించకుండా, కేవలం గ్యారెంటీ కార్డులు అని ఇంటింటికీ పంచారని కేటీఆర్‌ విమర్శించారు. “18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకు రూ.2500 ఇస్తామని చెప్పారు. యువతులకు స్కూటీలు, పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తాం అన్నారు. కేసీఆర్‌ ఉన్నప్పుడు ఇచ్చిన పెన్షనే ఇప్పుడు కూడా ఇస్తున్నారు. రెండేళ్లలో రేవంత్‌ ఒక్క ఇటుక పెట్టలేదు, ఒక కొత్త పునాది లేదు. తెల్లారు లేస్తే మైకు పట్టుకొని కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. హైదరాబాద్‌లో కొత్తగా ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదు” అని కేటీఆర్ ధ్వజమెత్తారు. “ఏదైనా అడిగితే ఫ్రీ బస్సు ఇచ్చాం కదా అని చెబుతున్నారు. ఆడవాళ్లకు ఫ్రీ ఇస్తున్నారు… మగవాళ్లకు డబుల్‌ రేటు పెట్టారు. కుడిచేత్తో ఇచ్చి ఎడమచేత్తో తీసుకుంటున్నారు. కాంగ్రెస్‌ వాళ్లు ఇంటికి వస్తే బాకీ కార్డు చూపించి ప్రజలు హామీ గురించి ప్రశ్నించాలి” అని కేటీఆర్‌ కోరారు. ఒక్కొక్క మహిళకు నెలకు రూ.2500 చొప్పున ఇప్పటి వరకు రూ.60 వేలు, వృద్ధులు, వితంతువులకు రూ.48 వేలు, రైతులకు రేవంత్‌ రెడ్డి బాకీ ఉన్నారని ఆయన లెక్కలు చెప్పారు.

పేదల ఆశలు అడియాశ‌లు

కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు వాస్తవం కాలేదని, పేదల ఆశలు దెబ్బతిన్నాయని మండిపడ్డారు. కేసీఆర్‌ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజల కష్టాలు తగ్గాయి. ఉచిత మంచినీళ్లు, బస్తీ దవాఖానాలు, రూ.5 భోజనం, పింఛన్లు, రంజాన్‌ తోఫాతో పాటు అనేక పథకాలు అమలు చేశారని కేటీఆర్‌ గుర్తుచేశారు. ఇప్పుడేమో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలను బకాయిలతో ముంచేసింది. వృద్ధులు, రైతులు, మహిళలు అందరిని కాంగ్రెస్‌ మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం మోసపోయాం.. కానీ ఇప్పుడు జూబ్లీహిల్స్‌ ప్రజలు మోసపోవద్దు. అందుకే మేం కూడా జూబ్లీహిల్స్‌కు వచ్చి ప్రచారం చేస్తామని గ్రామాల నుంచి రైతులు, ప్రజలు చెబుతున్నారని అన్నారు. మోసాన్ని మోసంతోనే జయించాలి. ప్రజల నిజమైన అభివృద్ధి కోసం బీఆర్‌ఎస్‌ను మళ్లీ అధికారంలోకి తేవాల‌ని ఆయన పిలుపునిచ్చారు.

ఒక్క సీటూరాలే..

బీసీలకు రిజర్వేషన్లు, దళితులకు కాంట్రాక్టుల్లో వాటా ఇస్తామన్నారు. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు ఏ వర్గాన్ని వారు వదల్లేదు. రూ.4 వేల కోట్ల బడ్జెట్‌ పెడతానని ముస్లింలను మోసం చేశారు. కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలంటే చిన్న షాక్‌ ఇవ్వాల్సిందే… లేదంటే వాళ్లు దారికి రారు. “పొరపాటున కాంగ్రెస్‌కు ఓటేస్తే… మేం ఏం చేయకపోయినా… మోసం చేసినా మాకే ఓటేస్తున్నారని వాళ్లు భావిస్తారు. ఇన్ని రకాలుగా మోసం చేసినా… మళ్లీ మాకే ఓటేస్తున్నారంటే మేమే కరెక్ట్‌ అని వాళ్లు అనుకుంటారు” అని కేటీఆర్‌ హెచ్చరించారు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో హైదరాబాద్‌ వ్యాప్తంగా వారికి ఒక్క సీటు కూడా రాలేదని కేటీఆర్ గుర్తుచేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌ జూబ్లీహిల్స్ పీఠంపై హ‌స్తం పార్టీ జెండా ఉప ఎన్నిక గెలుపుతో...

హీరో నాగార్జునపై కామెంట్స్ చేస్తూ మంత్రి సురేఖ ట్వీట్…

హీరో నాగార్జునపై కామెంట్స్ చేస్తూ మంత్రి సురేఖ ట్వీట్... https://twitter.com/iamkondasurekha/status/1988313863826379169 కాకతీయ, వరంగల్ సిటీ...

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించిన స‌ర్వే సంస్థ‌లు అన్నింట్లోనూ అధికార పార్టీకి స్పష్టమైన...

కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయాల‌ని చూస్తోంది

https://twitter.com/TeluguScribe/status/1987795147560722497 కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయాల‌ని చూస్తోంది ఫేక్ స్లిప్పుల‌ను ఎన్నిక‌ల అధికారికి...

అద్దె చెల్లించలేదు.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు తాళం..!

అద్దె చెల్లించలేదు.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు తాళం..! https://twitter.com/TeluguScribe/status/1987768671163629993 కాక‌తీయ‌, వెబ్‌డెస్క్ : అద్దె చెల్లించకపోవడంతో...

చలి పంజా

చలి పంజా రాష్ట్ర వ్యాప్తంగా పడిపోయిన ఉష్ణోగ్ర‌త‌లు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో...

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ బూత్ బ్రదర్స్

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ బూత్ బ్రదర్స్ కాంగ్రెస్, బీజేపీది ఫెవికాల్ బంధం ముఖ్యమంత్రి...

కేటీఆర్ బ‌క్వాస్‌..

కేటీఆర్ బ‌క్వాస్‌.. ఆయ‌న మాట‌లు న‌మ్మొద్దు వ‌చ్చే ఐదేండ్లు రేవంత్ సీఎంగా ఉంటారు న‌వీన్ యాదవ్‌ను...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img