- జిల్లా పౌరసంబంధాల అధికారి పసునూరి రాజేంద్రప్రసాద్
కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : తెలంగాణ రైజింగ్ – 2047 సిటిజన్ సర్వే లో ప్రజలు పాల్గొనాలని జిల్లా పౌరసంబంధాల అధికారి పసునూరి రాజేంద్రప్రసాద్ అన్నారు. 2047 నాటికి భారత దేశ స్వాతంత్య్రానికి వందేళ్లు పూర్తి కానుందన్నారు. కాగా, ఆ నాటికి తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలో ప్రజల నుంచి తగు సలహాలు, సూచనలు ప్రభుత్వం కోరుతోందన్నారు. ఈ సర్వే ఈనెల 25 వతేదీతో ముగియనుందన ప్రతీ ఒక్కరూ తమ అమూల్యమైన సూచనలు అందజేయాలని ఆయన పిలుపునిచ్చారు.


