epaper
Monday, March 2, 2026
epaper

ప్రజల అస్తిత్వ పోరాటానికి ప్రతీక తెలంగాణ‌: అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌

కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్: తెలంగాణ రాష్ట్రం ఒక భౌగోళిక స్వరూపం మాత్రమే కాద‌ని , ప్రజల అస్తిత్వ పోరాటానికి ప్రతీక అని మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కూమార్ అన్నారు. బుధవారం రోజున కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానం లో నిర్వహించిన తెలంగాణ ప్ర‌జా పాల‌న దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్ పాల్గొని జాతీయ పతకాన్ని ఎగురవేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్ల‌డుతూ.. 1948 సెప్టెంబర్‌ 17న తెలంగాణ నిజాం చెర నుంచి విముక్తి పొంది భారతదేశంలో విలీనమైన చారిత్రక సందర్భాన్ని స్మరించుకున్నారు. తెలంగాణ పోరాట యోధులు, వీరమరణం పొందిన నాయకులను ఆయన ఘనంగా నివాళులర్పించారు. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నుండి 2014లో రాష్ట్ర ఆవిర్భావం వరకు జరిగిన చారిత్రాత్మక ఘట్టాలను ఈ సందర్బంగా మంత్రి ప్రస్తావించారు.

అలాగే జిల్లాలో సంక్షేమ ఫ‌థ‌కాల గురించి మంత్రి మాట్ల‌డుతూ..మహాలక్ష్మి పథకం కింద ఇప్పటి వరకు 5.35 కోట్ల మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశార‌ని, దీంతో రూ. 227 కోట్ల లబ్ధి పొందారని, గ్యాస్‌ సిలెండర్‌లను 500 రూపాయలకే 6.33 లక్షలు పంపిణీ చేసి, రూ.19.59 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం భరించిందన్నారు.

గృహజ్యోతి పథకం కింద 1.58 లక్షల సర్వీసులకు జీరో బిల్లులు జారీ చేసి రూ. 6.94 కోట్ల రూపాయలు చెల్లించార‌ని, ఇందిరమ్మ రైతు భరోసా ద్వారా 1.90 లక్షల మంది రైతులకు రూ. 206.62 కోట్ల రూపాయలు జమ చేశార‌న్నారు. రుణ మాఫీ కింద 79,541 మంది రైతులకు రూ. 622.06 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింద‌ని, రైతు బీమా కింద మరణించిన రైతు కుటుంబాలకు రూ. 25.50 కోట్ల రూపాయలు అందించడం జ‌రిగింద‌ని మంత్రి తెలిపారు.

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా 12,483 వ్యవసాయ కూలీల కుటుంబాలకు రూ.7.48 కోట్ల రూపాయలు అందించారని, ఆరోగ్యశ్రీ కింద 15,436 మందికి 44.23 కోట్ల విలువైన ఉచిత శస్త్ర చికిత్సలు జరిగాయ‌ని, జిల్లాలో 11,575 మందికి ఇండ్లు మంజూరు కాగా, 5,844 ఇండ్ల పనులు ప్రారంభం అవ‌గా ఇప్పటివరకు రూ. 45.91 కోట్ల రూపాయలు విడుదల అయినట్లు అయ‌న తెలిపారు.

29,426 భూ సమస్యల దరఖాస్తులను పరిష్కరిస్తూ, 233 లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు శిక్షణ ఇచ్చార‌ని, రబీ సీజన్‌లో 3.10 లక్షల టన్నుల ధాన్యం సేకరించి, 58,302 మంది రైతులకు రూ. 720.85 కోట్ల రూపాయలు జమ చేయ‌డం జ‌రిగింద‌న్నారు. 39,645 కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేసి, జిల్లాలో 3.13 లక్షల కుటుంబాలకు నెలనెలా 5,913 టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నామ‌ని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు వసతి గృహాలు, ఉపకార వేతనాలు, విదేశీ విద్యకు ఆర్థిక సహాయం అందిస్తున్నారన్నారు.

1.23 లక్షల జాబ్‌ కార్డులు జారీ చేసి, రూ.15.40 లక్షల పని దినాలు కల్పించ‌డం జరిగింద‌న్నారు.517 వ్యక్తిగత యూనిట్లకు రూ.10.16 కోట్లు, 78 గ్రూపు యూనిట్లకు రూ. 7.36 కోట్లు, 338 సంఘాలకు రూ. 54.49 కోట్ల బ్యాంకు రుణాలు మంజూరు చేశారని అయన తెలిపారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమంలో అందరి సహకారం అమూల్యం అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తాం అని అయ‌న హామీ ఇచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో క‌రీంన‌గ‌ర్ జిల్లా కలెక్ట‌ర్ ప‌మేలా స‌త్ప‌తి, పోలీస్ కమిష‌న‌ర్ గౌష్ ఆలం, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, ల‌క్ష్మీ కిర‌ణ్ త‌దిత‌రులు పాల్గోన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img