కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం 2.15 గంటలకు వాదనలు వింటామని సీజే జస్టిస్ ఏకే సింగ్ నేత్రుత్వంలోని ధర్మాసనం తెలిపింది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యిందని..ఎన్నికల ప్రక్రియలో కోర్టులు జోక్యం చేసుకోవద్దనే తీర్పులు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ ధర్మాసనం ద్రుష్టికి తీసుకువచ్చారు.
ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ కు సంబంధించిన నోటిఫికేషన్ ను కోర్టుకు అందించారు. ఈ సమయంలో స్టే ఇవ్వడం కూడా సరికాదు అన్నారు. సమగ్ర అధ్యయనం తర్వాతే బీసీ బిల్లు చేశారు. జీవో తెచ్చారంటూ వివరించారు. పూర్తి వాదనలు విన్న తర్వాతే జీవో నెంబర్ 9పై నిర్ణయం తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం తరపున పూర్తి స్థాయి వాదనలు సమర్పిస్తామని తెలిపారు. దీంతో తదుపరి విచారణను హైకోర్టుకు గురువారం మధ్యాహ్నంకు వాయిదా వేసింది.


