తెలంగాణ పోరాట యోధుడు కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ
కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర సాధనకు కృషి చేసిన తెలంగాణ పోరాట యోధుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున హాజరై సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రజలకు అంకితం చేసిన నాయకుడిగా కేసీఆర్ సేవలను స్మరించుకున్నారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ములుగు జిల్లా ఇన్చార్జ్ బడే నాగజ్యోతి కేక్ కట్ చేసి నినాదాలు చేశారు. ఈ వేడుకల్లో మండల నాయకులు సునీల్, మల్లారెడ్డి, సర్దార్ పాషా, ఖాజా పాషా తదితర ముఖ్య నాయకులు, వార్డ్ మెంబర్లు, సర్పంచులు పాల్గొని కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
పార్టీ కార్యాలయం నినాదాలతో మార్మోగి, కార్యకర్తలు ఉత్సాహంగా వేడుకలు నిర్వహించారు.


