epaper
Thursday, January 15, 2026
epaper

గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా తెలంగాణ

గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా తెలంగాణ
ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి
రాష్ట్రంలో “తోషిబా” రూ.347 కోట్ల పెట్టుబడి
రూ.177 కోట్లతో ఈహెచ్‌వీ పవర్ ట్రాన్స్ ఫార్మర్ల ప్లాంట్ విస్తరణ
రూ.65 కోట్లతో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీ ఫర్ సీ ఆర్ జీవో కోర్ ప్రాసెసింగ్ సెంటర్
రూ.105 కోట్లతో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీ ఫర్ సర్జ్ అరెస్టేర్ యూనిట్
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణను గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా మార్చేందుకు మా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని తోషిబా ట్రాన్స్ మిషన్ అండ్‌ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్(ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ ప్రాంగణంలో రూ.347 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈహెచ్ వీ పవర్ ట్రాన్స్ ఫార్మర్ల ప్లాంట్ విస్తరణ పనులకు భూమి పూజ, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీ ఫర్ సీఆర్జీవో కోర్ ప్రాసెసింగ్ సెంటర్, సర్జ్ అరెస్టేర్ యూనిట్లను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. “అనతి కాలంలోనే తెలంగాణ తయారీ రంగంలో దేశానికి దిక్సూచిగా మారింది. 2024 -25 లో ఇండస్ట్రియల్ అవుట్ పుట్ రూ.2.77 లక్షల కోట్లు. ఇందులో 48 శాతం వాటా తయారీ రంగానిదే. 9 నెలల్లోనే రూ.లక్ష కోట్ల విలువైన మార్చండైజ్ ఎక్స్ పోర్ట్స్ రాష్ట్రం నుంచి జరిగాయి. జీఎస్ డీపీ వృద్ధి రేటు 8.2 శాతం. ఇది జాతీయ సగటు కంటే ఎక్కువ” అని ఈ సందర్భంగా ఆయన వివరించారు.

2040 నాటికి దేశీయ విద్యుత్ డిమాండ్ రెట్టింపు

“2040 నాటికి దేశీయ విద్యుత్ డిమాండ్ రెట్టింపు అవుతుందని ఆర్థిక సర్వే(2024 – 25) లెక్క తేల్చింది. ఈ డిమాండ్‌ను అందిపుచ్చుకొని రాష్ట్రానికి కొత్త పరిశ్రమలను తీసుకొచ్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాం. తెలంగాణ‌ను రెన్యువబుల్స్ ఇంజిన్ ఆఫ్ ఇండియా గా మార్చాలనే సంకల్పంతో క్లీన్ అండ్‌ గ్రీన్ ఎనర్జీ పాలసీ – 2025ను తీసుకొచ్చాం. ఇప్పటికే క్లీన్ ఎనర్జీలో రూ.29వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలిగాం. 2030 నాటికి న్యూ రెన్యువబుల్ కెపాసిటీని 20వేల మెగా వాట్లకు పెంచేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నాం” అని చెప్పారు.

ప్రత్యేకంగా గ్రీన్ ఎనర్జీ ఎక్విప్ మెంట్ జోన్లు…

“బ్యాటరీలు, పవర్ కాంపోనెంట్స్, స్మార్ట్ గ్రిడ్స్ తదితర రంగాల్లో తోషిబా లాంటి దిగ్గజ సంస్థలను తెలంగాణాకు ఆహ్వానించేందుకు ప్రత్యేకంగా గ్రీన్ ఎనర్జీ ఎక్విప్ మెంట్ జోన్లు ఏర్పాటు చేయబోతున్నాం.
స్మార్ట్ ఎనర్జీ సొల్యూషన్స్ కోసం తోషిబా – తెలంగాణ ఆర్ అండ్ డీ హబ్‌కు శ్రీకారం చుట్టబోతున్నాం.
క్లీన్ టెక్, సెమీ కండక్టర్స్, రోబోటిక్స్, అడ్వాన్స్ మాన్యుఫాక్చరింగ్ లో పెట్టుబడులకు తెలంగాణలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ వేదిక ద్వారా జపాన్ కంపెనీలను
రాష్ట్ర ప్రభుత్వం తరఫున సాదరంగా ఆహ్వానిస్తున్నా” అని అన్నారు.

దుష్ప్రచారానికి ధీటైన సమాధానం తోషిబా…

“కొత్త పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకొచ్చి మన యువతకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతోనే అంతర్జాతీయ, జాతీయ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నాం. కానీ.. కొందరు కావాలని పని గట్టుకొని వాటిని ఉత్తుత్తి ఎంవోయూ లు అంటూ మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ విమర్శలకు ఈరోజు మేం కాదు, తోషిబా కంపెనీనే మీకు ధీటైన సమాధానం ఇస్తుంది. ఈ ఏప్రిల్‌లో జపాన్ పర్యటనలో
రూ. 562 కోట్ల పెట్టుబడులకు సంబంధించి తోషిబా కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ చేసుకుంది. బుల్లెట్ ట్రైన్ స్పీడ్‌తో ఈరోజు రూ.177 కోట్లతో ఏర్పాటు చేయబోయే ఈహెచ్ వీ పవర్ ట్రాన్స్ఫార్మర్ల ప్లాంట్ విస్తరణ పనులకు భూమి పూజ నిర్వహించుకున్నాం. రూ.65 కోట్లతో ఏర్పాటు చేసిన స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీ ఫర్ సీ ఆర్ జీవో కోర్ ప్రాసెసింగ్ సెంటర్, రూ.105 కోట్లతో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీ ఫర్ సర్జ్ అరెస్టేర్ ను ప్రారంభించుకున్నాం. ఈ పెట్టుబడులతో ఎనర్జీ రంగంలో తెలంగాణ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తం అవుతుంది” అని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకట స్వామి, ఐటీ శాఖ స్పెషల్ సీఎస్ సంజయ్ కుమార్, జపాన్ ఎంబసీ ఎకనామిక్ అండ్‌ డెవలప్మెంట్ మంత్రి క్యోకో హొకుగొ, తోషిబా కార్పొరేషన్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ హిరోషి కెనెట, సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం ఖ‌మ్మంలో పార్టీని నిల‌బెట్టేది ఎవ‌రు..? మాజీమంత్రినా..? మాజీ ఎంపీనా..? కారు దిగిపోతున్న...

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం అక్రిడిటేషన్లు తగ్గవు… మరింత పెరుగుతాయి జీవో–252లో మార్పులు, సూచనలకు...

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్ అమెరికా ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక...

జంక్ష‌న్లు జామ్‌

జంక్ష‌న్లు జామ్‌ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ 6 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన...

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌ ప్రాపర్టీ ధరలు హైక్ ! దాదాపు 15 నుండి...

క‌థ‌నం క‌ల‌క‌లం !

క‌థ‌నం క‌ల‌క‌లం ! ఐఏఎస్ అధికారికి, మంత్రికి మధ్య వివాహేతర బంధం ? అత్యంత...

విష‌మిచ్చి చంపండి

విష‌మిచ్చి చంపండి ఇప్ప‌టికే స‌గం చ‌నిపోయా మహిళా అధికారులను వివాదాల్లోకి లాగొద్దు రేటింగ్స్ కోసం మానసిక...

వివాదాలొద్దు

వివాదాలొద్దు ప‌క్క రాష్ట్రాల‌తో చ‌ర్చ‌ల‌కు సిద్ధం ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంతో ముందుకుసాగుదాం ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ 2034...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img