epaper
Thursday, January 15, 2026
epaper

‘ఏఐ కేపిటల్ ఆఫ్ ది గ్లోబ్’గా తెలంగాణ..హైదరాబాద్‌లో జాగర్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ప్రారంభం

కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణను ప్రపంచానికి ‘ఏఐ కేపిటల్ ఆఫ్ ది గ్లోబ్’గా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. హైటెక్ సిటీలో అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ జాగర్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ)ను ఆయన బుధవారం లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్ అన్ని రంగాలకు చెందిన గ్లోబల్ కంపెనీలకు ప్రాధాన్య గమ్యస్థానమైంది. ఇప్పుడు జాగర్ కూడా ఈ జాబితాలో చేరడం రాష్ట్ర బ్రాండ్‌ ను మరింతగా ప్రపంచానికి పరిచయం చేస్తుందన్నారు. ఈ కేంద్రం ద్వారా కొత్తగా 180 మందికి ఉపాధి లభించగా, త్వరలో అది 500కు పెరుగుతుంది అన్నారు. జాగర్ ఏఐ ప్లాట్‌ఫాం, ప్రొక్యూర్‌మెంట్ పరిష్కారాల అభివృద్ధికి ఈ జీసీసీ వ్యూహాత్మక కేంద్రంగా నిలుస్తుందని తెలిపారు.

సాఫ్ట్‌వేర్, క్లౌడ్ ఆపరేషన్ సేవలను ప్రపంచవ్యాప్తంగా తయారీ, విద్య, ఎఫ్‌ఎంసీజీ, రిటైల్ వంటి రంగాలకు అందిస్తుందని వివరించారు. హైదరాబాద్ జీసీసీలకు అనుకూల కేంద్రంగా మారిందని, గత ఏడాదిలోనే 70 జీసీసీలు ప్రారంభమయ్యాయని, ఈ ఏడాది మరో 100 జీసీసీలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.

ఏఐ రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలపడానికి ప్రత్యేకంగా ఏఐ సిటీ, అంతర్జాతీయ ప్రమాణాలతో ఏఐ యూనివర్సిటీ, ఏఐ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో జాగర్ సీఈఓ ఆండ్రూ రోస్కో, చీఫ్ డిజిటల్ అండ్ ఏఐ ఆఫీసర్ గోపీనాథ్ పోలవరపు, చీఫ్ కస్టమర్ ఆఫీసర్ ట్రాయ్ మేయర్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మీ పార్టీలో మహిళలకు టికెట్లు ఎక్కడ..?

మీ పార్టీలో మహిళలకు టికెట్లు ఎక్కడ..? నిర్ణయాధికారాలు ఎవరివి..? ముస్లిం మహిళలు మీ...

సికింద్రాబాద్‌పై కత్తి పెట్టొద్దు!

సికింద్రాబాద్‌పై కత్తి పెట్టొద్దు! డీలిమిటేషన్ పేరుతో కుట్ర కార్పొరేషన్‌తో పాటు జిల్లా ఏర్పాటు చేయాలి హైద‌రాబాద్‌ను...

తెలంగాణలో హిందువుల భద్రత ప్రశ్నార్థకం

తెలంగాణలో హిందువుల భద్రత ప్రశ్నార్థకం దేవాలయాలపై దాడులు యాదృచ్ఛికం కావు కాంగ్రెస్ పాలనలో ‘అప్పీజ్‌మెంట్’...

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం ఖ‌మ్మంలో పార్టీని నిల‌బెట్టేది ఎవ‌రు..? మాజీమంత్రినా..? మాజీ ఎంపీనా..? కారు దిగిపోతున్న...

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం అక్రిడిటేషన్లు తగ్గవు… మరింత పెరుగుతాయి జీవో–252లో మార్పులు, సూచనలకు...

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్ అమెరికా ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక...

జంక్ష‌న్లు జామ్‌

జంక్ష‌న్లు జామ్‌ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ 6 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన...

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌ ప్రాపర్టీ ధరలు హైక్ ! దాదాపు 15 నుండి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img