బిఆర్ఎస్ ఫ్లెక్సీల చించివేత
కాకతీయ,గీసుగొండ: బిఆర్ఎస్ పార్టీ పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి జన్మదిన సందర్భంగా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించి వేశారు.ఈ ఘటనపై మండల నాయకులు మాజీ సర్పంచ్ బోడకుంట్ల ప్రకాష్ మాట్లాడుతూ… ఎవరి పార్టీ నాయకుల ఫ్లెక్సీలను వారు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ ఉందని,బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయలేదని అధికార పార్టీ కి చెందిన కొంతమంది నాయకులే బిఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు చింపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ వ్యవహారంపై పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు శిరీసే శ్రీకాంత్,కోట ప్రమోద్ గ్రామ పార్టీ అధ్యక్షులు పసుల రాజేందర్,సోషల్ మీడియా నాయకులు ఐలోని అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.
బిఆర్ఎస్ ఫ్లెక్సీల చించివేత
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


