2026లో టీమిండియా కు అగ్నిపరీక్షే
సొంతగడ్డపై టీ20 వరల్డ్‌కప్… టెస్టుల్లోనూ అనేక సవాళ్లు
కాకతీయ, స్పోర్ట్స్ డెస్క్ : భారత పురుషుల క్రికెట్ జట్టుకు 2026 సంవత్సరం అత్యంత బిజీగా, అదే సమయంలో కీలకమైన ఏడాదిగా మారనుంది. ఒకవైపు సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వడం, డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా టైటిల్‌ను నిలబెట్టుకోవాలన్న ఒత్తిడి… మరోవైపు టెస్ట్ క్రికెట్‌లో కోల్పోయిన గౌరవాన్ని తిరిగి సాధించాల్సిన అవసరం జట్టును ఎదుర్కోనుంది. 2025లో దక్షిణాఫ్రికాతో సొంతగడ్డపై జరిగిన టెస్టు సిరీస్‌లో భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో టెస్ట్ ఫార్మాట్‌లో జట్టు బలహీనతలపై తీవ్ర చర్చ జరిగింది. అయితే అదే సమయంలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం భారత్ అద్భుత ప్రదర్శన కనబరిచి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది.
యువతపై భారీ బాధ్యత
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లు లేకుండా టీమిండియా బరిలోకి దిగే అవకాశం ఉండటంతో యువ ఆటగాళ్లపై భారీ బాధ్యత పడనుంది. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్‌లో కొత్త తరం ఆటగాళ్లు ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారన్నది కీలకంగా మారనుంది. టీ20ల్లో టైటిల్ రక్షణ, టెస్టుల్లో పునరుజ్జీవనం, వన్డేల్లో స్థిరత్వం… మూడు ఫార్మాట్లలోనూ తమను తాము నిరూపించుకోవాల్సిన అగ్నిపరీక్ష టీమిండియాకు ఎదురవుతోంది. అందుకే 2026 సంవత్సరం భారత క్రికెట్‌కు “నిర్ణాయక సంవత్సరం”గా నిలవనుంది.
న్యూజిలాండ్‌తో ఏడాది ఆరంభం
2026 ఏడాది ఆరంభంలోనే న్యూజిలాండ్ జట్టు భారత్‌కు రానుంది. మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌తో ఏడాది మొదలుకానుంది. ఈ సిరీస్‌ను టీ20 ప్రపంచకప్‌కు ముందు కీలక సాధనగా బీసీసీఐ భావిస్తోంది.
2026లో టీమిండియా షెడ్యూల్ (సంక్షిప్తంగా)
జనవరి 2026: న్యూజిలాండ్ భారత్ పర్యటన
వన్డేలు : జనవరి 11 – వడోదర
జనవరి 14 – రాజ్‌కోట్
జనవరి 18 – ఇండోర్
టీ20లు
జనవరి 21 – నాగ్‌పూర్
జనవరి 23 – రాయ్‌పూర్
జనవరి 25 – గౌహతి
జనవరి 28 – విశాఖపట్నం
జనవరి 31 – తిరువనంతపురం
ఫిబ్రవరి–మార్చి 2026: టీ20 ప్రపంచకప్ (భారత్, శ్రీలంక)
ఫిబ్రవరి 7 – భారత్ vs USA (ముంబై)
ఫిబ్రవరి 12 – భారత్ vs నమీబియా (ఢిల్లీ)
ఫిబ్రవరి 15 – భారత్ vs పాకిస్థాన్ (కొలంబో)
ఫిబ్రవరి 18 – భారత్ vs నెదర్లాండ్స్ (అహ్మదాబాద్)
మార్చి 5 – సెమీఫైనల్ (ముంబై)
మార్చి 8 – ఫైనల్ (అహ్మదాబాద్)
మార్చి–మే 2026
IPL 2026 – మార్చి 26 నుంచి మే 31 వరకు
జూన్ 2026
ఆఫ్ఘనిస్తాన్ భారత్ పర్యటన – 3 వన్డేలు, 1 టెస్ట్
జూలై 2026: ఇంగ్లాండ్ పర్యటన
5 టీ20లు
3 వన్డేలు (లార్డ్స్‌లో చివరి వన్డే)
ఆగస్టు 2026
శ్రీలంక పర్యటన – 2 టెస్టులు
సెప్టెంబర్ 2026
ఆఫ్ఘనిస్తాన్‌తో 3 టీ20లు
ఆసియా క్రీడలు (జపాన్)
వెస్టిండీస్ భారత్ పర్యటన
అక్టోబర్–నవంబర్ 2026
న్యూజిలాండ్ పర్యటన – 2 టెస్టులు, 3 వన్డేలు
డిసెంబర్ 2026
శ్రీలంక భారత్ పర్యటన – 3 వన్డేలు, 3 టీ20లు


