ఉపాధ్యాయులకు రెమ్యూనరేషన్ చెల్లించాలి
కాకతీయ, తొర్రూరు : ఎన్నికల విధులు, కుల గణనలో పాల్గొన్న ఉపాధ్యాయులకు పెండింగ్‌లో ఉన్న రెమ్యూనరేషన్‌ను వెంటనే చెల్లించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరారు. మంగళవారం టీపిటీఎఫ్, ఎస్టీయూ, పీఆర్‌టీయూ సంఘాల నాయకులు జిల్లా కేంద్రంలో కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు సంబంధించిన పలు సమస్యలపై చర్చించారు. గ్రామపంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి, ఏకగ్రీవం అయిన చోట్లతో పాటు రిజర్వ్ సిబ్బందికీ రెమ్యూనరేషన్ చెల్లించేలా ఎంపీడీవోలను ఆదేశిస్తామని కలెక్టర్ తెలిపారు. కుల గణన విధుల్లో పాల్గొన్న సిబ్బందికీ చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీపిటీఎఫ్ అధ్యక్షుడు బలాస్టి రమేష్, పీఆర్‌టీయూ గీత, యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి యాకూబ్, ఎస్టీయూ నాయకుడు ప్రసాద్, ఇతర ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.


