ఉపాధ్యాయ పెండింగ్ బిల్లులను విడుదల చేయాలి
ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి
పెన్షనర్స్ బకాయుల విడుదలకు కృషి చేస్తా
పీఆర్టీయూ టీఎస్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి
ఖమ్మం జిల్లాశాఖ చేపట్టిన 30 గంటల నిరాహార దీక్ష విరమణ
కాకతీయ,ఖమ్మం : ఉపాధ్యాయ, ఉద్యోగుల పెండింగ్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని పీఆర్టీయూ టీఎస్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి డిమాండ్ చేశారు.జిల్లా అధ్యక్షులు కట్టా శేఖర్ రావు అధ్యక్షతన జరిగిన దీక్ష ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ పీఆర్టీయూ టీఎస్ ఖమ్మం జిల్లాశాఖ చేపట్టిన 30 గంటల నిరాహార దీక్షను ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ పెండింగ్ బిల్లులు, పెన్షనర్స్ బకాయిలు, పెండింగ్ డీఏలను విడుదల చేయాలని, పీఆర్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం లోని ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతున్న ప్పటికీ ఉద్యోగులు , ఉపాధ్యాయులకు ఎన్నికల ముందు మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలను నెరవేర్చక పోవడం శోచనీయమని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ పెండింగ్ బిల్లులు , పెన్షనర్స్ బకాయిలు , పెండింగ్ డీఏలు విడుదల,పీఆర్సి ఏర్పాటు , సీపీఎస్ రద్దు తదితర సమస్యల పరిష్కారానికై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రి వర్గ ఉప సంఘం సభ్యులను కలిసి అనేక మార్లు ప్రాతినిధ్యం చేశామని అన్నారు. నెలకు 700 కోట్లు చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ దిశగా నిధులు విడుదల చేయక పోవడంతో ఉద్యోగులు , ఉపాధ్యాయులు తీవ్ర నిరాశకు గురయ్యారని అన్నారు. దాని పర్యవసానమే ఖమ్మం జిల్లాశాఖ చేపట్టిన 30 గంటల నిరాహార దీక్షని పేర్కొన్నారు. దీక్ష విరమణ కార్యక్రమంలో పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర ఆడిట్ కమిటీ చైర్మన్ సోమిరెడ్డి శ్రీనివాస రెడ్డి , పీఆర్పీఏ రాష్ట్ర రాష్ట్ర అధ్యక్ష , ప్రధానకార్యదర్సులు మోతుకూరి మధు , కే వెంకట నర్సయ్య , ఖమ్మం జిల్లా ప్రధానకార్యదర్శి ఆర్ రంగారావు , అసోసియేట్ అధ్యక్షులు విజయ్ అమృత కుమార్ , బ్రహ్మా రెడ్డి , రాష్ట్ర బాద్యులు వెంకటేశ్వరరావు , రెబ్బా శ్రీనివాసరావు , మదార్ హుస్సేన్ , జిల్లా బాద్యులు రత్న కుమార్ , రవికుమార్ , వినోద్ కుమార్ , కిరణ్ కుమార్ , చాంద్ బేగo , కొత్తగూడెం , సూర్యాపేట జిల్లాల అధ్యక్ష , ప్రధాన కార్యదర్సులు పాల్గొన్నారు


