కాకతీయ, తెలంగాణ బ్యూరో: విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు దారుణంగా ప్రవర్తిస్తున్న తీరు దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. మాట విడనం లేదని..అల్లరి చేస్తున్నారని..మార్కులు తక్కువగా వచ్చాయంటా.. పలు కారణాలతో విద్యార్థులను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఇష్టం వచ్చిన రీతిలో విద్యార్థులను చావబాదుతున్నారు కొంతమంది టీచర్లు. ఇలాంటి ఘటనలు ఈ మధ్యకాలంలో భారీగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా హైదరాబాదులో మరో ఘటన వెలుగులోకి వచ్చింది.
ఎల్బీనగర్ లోని మున్సురాబాద్ బిర్లా ఓపెన్ మైండ్స్ స్కూల్లో ఓ టీచర్ అత్యంత దారుణానికి పాల్పడింది. రెండవ తరగతి చదువుతున్న సాయినందన్ అనే విద్యార్థిని కొట్టడమే కాదు కళ్లల్లో పెన్సిల్ తో పొడిచి, నోటికి ప్లాస్టర్ వేసి మాట్లాడకుంటా చేస్తూ చిత్రహింసలు పెట్టింది.
ఈ ఘటనకు సంబంధించి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాదాపు నెల రోజుల నుంచి తమ కొడుకును చికిత్స అందిస్తున్నామని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యాన్ని నిలదీస్తే తమపై దాడి చేశారని మీడియాకు వెల్లడించారు. ఈ ఘటనపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.


