గీతకార్మికులకు టీసీఎస్ లైసెన్స్ కార్డులు తప్పనిసరి
తొర్రూర్ ఎక్సైజ్ ఎస్ఐ శంకర్
కాకతీయ, పెద్దవంగర : ప్రతి ఒక్క గీత కార్మికుడు టీసీఎస్ లైసెన్స్ కార్డులను పొందాలని తొర్రూరు ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ శంకర్ కోరారు. మంగళవారం మండలంలోని గట్లకుంట గ్రామంలో గీత కార్మికుల సొసైటీ గుర్తింపు కార్డుల గురించి ట్యాఢీ టాపింగ్ టెస్టింగ్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్క గీత కార్మికుడికి గుర్తింపు కార్డులను మంజూరు చేస్తున్నారన్నారు. టిసిఎస్ గుర్తింపు కార్డు ఉండటం వలన ప్రమాదవశాత్తు తాటి చెట్టు మీద నుంచి పడి మరణించిన లేదా పాక్షిక అంగ వైకల్యం కల్గిన తెలంగాణ ప్రభుత్వం ద్వారా వారికి ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా వర్తిస్తుందని తెలిపారు. 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క గీత కార్మికుడు ఈ కార్డు ద్వారా ప్రభుత్వం అందించే గీత కార్మిక పెన్షన్ కు అర్హులవుతారన్నారు. కార్యక్రమంలో సిబ్బంది శ్రీనివాస్, శశికాంత్, గౌడ సంఘ సొసైటీ అధ్యక్షుడు బండి లచ్చయ్య, సభ్యులు ఎరుకల సమ్మయ్య గౌడ్, గుర్రం శ్రీనివాస్, ఎల్లయ్య, రాములు, సోమ మల్లయ్య, వెంకన్న, రావుల సమ్మయ్య, యాకయ్య, బండి వెంకన్న, సమ్మయ్య, శ్రీనివాస్, సుమన్ ఎరుకల కొమరయ్య, గిరగాని మహేష్, రాంబాబు, జంపయ్య తదితరులు పాల్గొన్నారు.


