epaper
Monday, March 2, 2026
epaper

అనుమానితులంద‌రికీ టీబీ ప‌రీక్ష‌లు

అనుమానితులంద‌రికీ టీబీ ప‌రీక్ష‌లు
మొబైల్ ఎక్స్‌రే యంత్రంతో గ్రామాల్లోనే నిర్వ‌హ‌ణ‌
రోజుకు 60 మందికి పరీక్షల సామర్థ్యం
టీబీపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలి
ములుగు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గోపాల్ రావు

కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో అల్ట్రా పోర్టబుల్ హ్యాండిల్ హెల్డ్ మొబైల్ ఎక్స్‌రే యంత్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గోపాల్ రావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మొబైల్ ఎక్స్‌రే యంత్రం ద్వారా రోజుకు సుమారు 60 మంది వరకు పరీక్షలు నిర్వహించవచ్చని తెలిపారు. గ్రామాల్లో రోగుల వద్దకే వెళ్లి ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించడం ద్వారా టీబీ వంటి వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ సదుపాయాన్ని జిల్లా ప్రజలందరూ పూర్తిగా వినియోగించుకోవాలని కోరారు.

అనుమానితులందరికీ పరీక్షలు..

గ్రామాల్లో టీబీ అనుమానితులందరికీ ఈ మొబైల్ ఎక్స్‌రే ద్వారా పరీక్షలు నిర్వహించి, వ్యాధి నిర్ధారణ అయిన వారిని నిక్షయ్ పోర్టల్‌లో నమోదు చేసి, అవసరమైన మందులు పంపిణీ చేస్తామని వివరించారు.
ఈ విధానంతో ఎక్కువ మంది టీబీ బాధితులను త్వరితగతిన గుర్తించి వ్యాధి వ్యాప్తిని నియంత్రించవచ్చని డాక్టర్ గోపాల్ రావు పేర్కొన్నారు. గ్రామస్థాయి ఆరోగ్య సిబ్బంది టీబీ వ్యాధిపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. టీబీ నియంత్రణ కార్యక్రమంలో పాల్గొనే సిబ్బంది సమన్వయంతో పనిచేసి నోటిఫికేషన్‌లు, ప్రిజంప్టివ్ ట్రీట్మెంట్ సంఖ్యను పెంచాలని ఆదేశించారు. డిసెంబర్ నెలలోపు సూక్ష్మ ప్రణాళికలు సిద్ధం చేసి, షెడ్యూల్ ప్రకారం విధులు నిర్వహించాలని, నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీబీ నియంత్రణాధికారి డాక్టర్ చంద్రకాంత్, డబ్ల్యూహెచ్ఓ కన్సల్టెంట్ డాక్టర్ బ్లేస్సి, డెమో సంపత్, టీబీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ రమేష్, ల్యాబ్ టెక్నీషియన్లు చంద్రమౌళి, ఎస్.టి.ఎస్ రాజు, పరుశురాం, ఎన్‌జీఓ ప్రతినిధి రాజు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img