టాక్సిక్’లో తారా సుతారియా షాకింగ్ లుక్
కాకతీయ, సినిమా : యశ్ హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ మరో ఆసక్తికర పాత్రను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఈ చిత్రంలో నటి తారా సుతారియా ‘రెబెక్కా’గా కనిపించనున్న ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇప్పటికే కియారా అద్వానీ (నాడియా), హుమా ఖురేషీ (ఎలిజబెత్), నయనతార (గంగా) పాత్రల ఫస్ట్‌లుక్స్‌తో అంచనాలు పెంచిన ‘టాక్సిక్’… తారా సుతారియా ఎంట్రీతో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రంతో తారా సుతారియా తొలిసారిగా పాన్ ఇండియా స్థాయిలో అడుగుపెడుతోంది. ఇప్పటివరకు ఆమెకు ఉన్న ‘ప్రెట్టీ గర్ల్’ ఇమేజ్‌కు పూర్తిగా భిన్నంగా, శక్తి, గన్‌లు, స్వీయరక్షణ తో కూడిన పాత్రలో కనిపించనుంది. తారా సుతారియాపై దర్శకురాలు గీతు మోహందాస్ మాట్లాడుతూ “తారా ఒక నిశ్శబ్ద స్వభావం కలిగిన వ్యక్తి. ఆమెను ఒత్తిడి చేయకుండా, ఆమెకు స్వేచ్ఛ ఇవ్వడమే సరైన మార్గమని భావించాను. ఆమె ఎక్కువగా గమనించేది, తక్కువగా మాట్లాడేది. కానీ ఆ నిశ్శబ్దంలోనే గొప్ప శక్తి దాగి ఉంది. ఆమె నటన నన్ను పూర్తిగా ఆశ్చర్యపరిచింది. ప్రేక్షకులను కూడా ఆమె ఆశ్చర్యపరుస్తుందనే నమ్మకం ఉంది” అని అన్నారు.
యశ్, గీతు మోహందాస్ కలిసి కథను రూపొందించిన ఈ చిత్రానికి గీతు మోహందాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కన్నడ, ఇంగ్లిష్‌లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళం, మలయాళం తదితర భాషల్లో డబ్ చేసి విడుదల చేయనున్నారు


