కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లోకి తక్కలపల్లి రవీందర్ రావు
నర్సంపేటలో మారనున్న రాజకీయ సమీకరణాలు
మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ కు షాక్
కాకతీయ, నర్సంపేట: మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ కన్వీనర్ తక్కలపల్లి రవీందర్ రావు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహణ అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు సమక్షంలో బిఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారిని కేటీర్ కండువా కప్పి సాధారంగా ఆహ్వానించారు.
నర్సంపేటలో మారనున్న రాజకీయ సమీకరణాలు
ముఖ్య నాయకుల చేరికతో నర్సంపేట పట్టణంతో పాటు నియోజకవర్గ రాజకీయ సమీకరణాలు మారానున్నాయి. గతంలో ఖానాపూర్ ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం ఛైర్మెన్ గా, మండల పరిషత్ అధ్యక్షుడుగా, నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి కీలకనేతగా ఎమ్మెల్యే దొంతి అనుచరుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రవీందర్ రావు చేరికతో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా ఉన్న రవీందర్ రావు చేరికతో బిఆర్ఎస్ పార్టీకి అటు పట్టణంలో ఇటు నియోజకవర్గం లో మరింత బలాన్ని చేకూర్చనుంది.


