ఈట్ స్ట్రీట్ నిర్మాణ పనులు చేపట్టండి
బల్దియా కమిషనర్ చాహాత్ బాజ్ పాయ్
బిల్లుల చెల్లింపు కోసం క్షేత్ర స్థాయిలో పరిశీలన
కాకతీయ, వరంగల్ : నగరంలోని వడ్డేపల్లి బండ్ పై ఈట్ స్ట్రీట్ నిర్మాణ పనులను చేపట్టాలని బల్దియా కమిషనర్ చాహాత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నగర పరిధిలోని వివిధ ప్రాంతాల్లో నిర్మాణాలు పూర్తి చేసుకున్న రోడ్డు డ్రైన్ ల నిర్మిత పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి నాణ్యత ప్రమాణాలను పరిశీలించి తగు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ నిర్మాణాలు పూర్తి చేసిన సిసి రోడ్లు, డ్రైన్ల బిల్లుల చెల్లింపుల కోసం ప్రత్యక్షంగా వీక్షించి కొలతలు వేసి పరిశీలించారు. కాజీపేట వెజిటేబుల్ మార్కెట్ తో పాటు జవహర్ కాలనీ ప్రాంతంలో బిల్లుల చెల్లింపు కోసం పరిశీలించి, కాజీపేట చర్చి వద్ద డ్రైన్ ను పరిశీలించారు, అనంతరం వడ్డేపల్లి బండ్ పై ఈట్ స్ట్రీట్ నిర్మాణానికి అనువైన స్థలాన్ని ఎంపిక చేసి నిర్మాణ పనులు ప్రారంభించేలా చూడాలని కమిషనర్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఈఈ రవికుమార్ డిఈ సారంగం, ఏఈలు హరికుమార్, రామన్న, వర్క్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.


