- తహసీల్దార్ ఎమ్డీ రియాజుద్దీన్
కాకతీయ, గీసుగొండ : మెంథా తుఫాన్ ప్రభావంతో రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని గీసుగొండ తహసీల్దార్ ఎమ్డీ రియాజుద్దీన్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మండల ప్రజలకు పలు సూచనలు చేశారు. వర్షాల కారణంగా పొలాల్లో నీరు నిల్వ కాకుండా చూసుకోవాలన్నారు. పశువులను సురక్షిత ప్రదేశాల్లో ఉంచుకోవాలని తెలిపారు. విద్యుత్ తీగలు, చెరువులు, వాగులు వంటి ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం విడుదల చేసే సూచనలను తప్పనిసరిగా అనుసరించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


