కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి
తహసిల్దార్ శ్రీనివాస్
కాకతీయ, ఇనుగుర్తి: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండలంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన తహసిల్దార్ సుంకరి శ్రీనివాస్ అన్నారు. మండలం లోని చిన్న నాగారం గ్రామానికి చెందిన రాజమాత గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తహసిల్దార్ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దళారులతో మోసపోకూడదని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మ్యాచర్ వచ్చిన వెంటనే ధాన్యాన్ని కాంటాలు నిర్వహించి సంబంధిత మిల్లులకు తరలించాలన్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసే ధాన్యాన్ని ప్రజలకే పంపిణీ చేస్తుంది కాబట్టి నాణ్యమైన ధాన్యాన్ని తీసుకురావాలని రైతులకు సూచించారు. వర్షాలు వస్తున్న నేపథ్యంలో ముందుగానే టార్పోలిన్లు సమకూర్చుకోవాలని సెంటర్లో ఎలాంటి దుర్వినియోగం చేసిన కఠిన చర్యలు తీసుకుంటానని సెంటర్ నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పార్థసారథి, ఏ పి ఎం నరేంద్ర కుమార్, ఏఈఓ ముజాహిద్, సీసీలు పుల్లయ్య, సోమయ్య, శ్రీనివాస్, వెంకన్న, సంఘం అధ్యక్షురాలు కవిత, సెంటర్ ఇన్చార్జి బైరు శ్రీమతి, బుక్ కీపర్ నాయిని కోమలత, నాయకులు కొయ్యడి ఏకాంతం, బైరు శ్రీనివాస్ గౌడ్, తుమ్మనపల్లి సతీష్ చారి, మీట్య తండా మాజీ సర్పంచ్ నరేష్, ఏఏంసి మాజీ డైరెక్టర్ రవి, బానోతు రమేష్, బానోతు రవి నాయక్, శ్రీనివాస్ నాయక్, జెల్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.


