- హనుమకొండ డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య
కాకతీయ,ఆత్మకూరు : కేంద్ర ఆరోగ్య శాఖ నిర్వహిస్తున్న స్వస్థనారి సశక్తి పరివార్ అభియాన్ మెగా వైద్య శిబిరాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని హనుమకొండ డిఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య అన్నారు. మంగళవారం ఆత్మకూరు మండల కేంద్రములోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రత్యేక వైద్యశిబిరాన్ని సందర్శించి మాట్లాడారు ఇప్పటివరకు ఐదు రోజులలో మొత్తం 40 ప్రత్యేక వైద్య శిబిరములు నిర్వహించామని ఆయన తెలిపారు.
ఈ నెల 24 తేదీన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దామెర, 25 తేదీన సిద్దాపూర్, రాయపర్తి , అయినవోలు 26 న శాయంపేట , కొండపర్తి 27 న ముల్కనూర్ , కమలాపూర్, 29 న వంగర, ఉప్పల్ అక్టోబర్ 1 తేదీన వేలేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఈ ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్పెషలిస్ట్ వైద్యుడు సేవలందిస్తారని ప్రభుత్వ సెలవులు మినహాయించి ఆశాలు, ఏఎన్ఎం లు తమ పరిధిలోని క్యాంపుల షెడ్యూల్ ప్రకారం మహిళలను ఈ వైద్య శిబిరములకు తీసుకురావాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూర్ వైద్యాధికారి డాక్టర్ స్వాతి, స్పెషలిస్ట్ వైద్యులు డాక్టర్ అక్షర బిందు , డాక్టర్ శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


