కాకతీయ, నెల్లికుదురు: ప్రగతి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మాజీ జెడ్పిటిసి హెచ్ వెంకటేశ్వర్లు అన్నారు. మండల కేంద్రంలోని స్థానిక గెస్ట్ హౌస్ లో శంకర కంటి ఆసుపత్రి నానక్ రామ్ గూడ హైదరాబాద్ వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం సోమవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ జెడ్పిటిసి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి క్యాంప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల కోసం ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం సంతోషకరమని ఇలాంటి సేవా కార్యక్రమాలు మా నెల్లికుదురు పరిసర గ్రామాల ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని కొనియాడారు.
ప్రగతి సేవా సమితి మండల కోఆర్డినేటర్ చెడుపాక వెంకన్న, మాట్లాడుతూ ప్రగతి సేవా సమితి ఆధ్వర్యంలో సామాజిక ఆర్థిక అక్షరాస్యత మీద పనిచేస్తుందని రైతులతో చిన్న మొత్తాల పొదుపులు చేయించడం, శంకర కంటి ఆసుపత్రి వారి సహకారంతో కంటి పరీక్షలు చేయించడం, ఇంకా ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో శంకర కంటి ఆసుపత్రి మేనేజ్మెంట్ రాజే, డాక్టర్. వట్టిమల్ల సింధుజ, మున్నూరి ప్రణతి.వారి బృందం ప్రగతి విలేజ్ కోఆర్డినేటర్ చినపాక మహేశ్వరి, నాయకులు కుమ్మరి కుంట్ల మౌనేందర్, ఆదర్శ రైతు ఇసంపల్లిష్ వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.


