నట్టల నివారణ మందులను సద్వినియోగం చేసుకోవాలి
మండల పశువైద్యాధికారి డాక్టర్ కె వినయ్
కాకతీయ, నడికూడ: హనుమకొండ జిల్లా పశు సంవర్ధక శాఖ ఆదేశాల మేరకు నడికూడ మండలం చర్లపల్లి గ్రామం లో పశు వైద్యశాఖ అధికారి డాక్టర్ వినయ్ ఆధ్వర్యంలో నట్టల నివారణ మందుల పంపిణి కార్యక్రమాన్ని, గురువారం స్థానిక సర్పంచ్ బండి రేణుక శంకర్,ఉప సర్పంచ్ మామిడాల శ్రీనివాసరెడ్డి, చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేకలు గొర్రెలకు ఉచిత నట్టాల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని పశువుల పెంపకం దారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మండల పరిషత్ వైద్యాధికారి వినయ్ మాట్లాడుతూ, గ్రామంలో మొత్తం 3200 గొర్రెలకు 310 మేకలకు నట్టల నివారణ మందులు తాగించడం జరిగిందని తెలిపారు.పశువులకు వచ్చే వ్యాధుల నివారణకు యజమానులు నటన నివారణ టీకాలు వేయించాలని సూచించారు. గ్రామాల్లో నిర్వహించే శిబిరాల్లో టీకాలు వేయించినట్లయితే వ్యాధులు ప్రబలకుండా ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్ ఎస్ సి నవత, వెటర్నరీ అసిస్టెంట్ రవీంద్రనాథ్, ఏ,లాల్ సింగ్,దూడే ఓదెలు, గూడూరు శ్రీనివాస్, బిక్షపతి, కార్తీక్, గొర్రెల పెంపకం దారులు రైతులు తదితరులు పాల్గొన్నారు


