కాకతీయ, బయ్యారం : హాస్టల్స్ మెనూ అమలు తీరును పరిశీలించేందుకు పై కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశాల మేరకు బుధవారం ఇర్సులాపురం ఆశ్రమ పాఠశాలను తహసీల్దార్ నాగరాజు సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్లో ఉన్న వంటగదిని, సరుకుల నాణ్యత, స్టోర్ రూమ్ పరిశుభ్రతను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ తనిఖీలో హెచ్ ఎం శోభన్ బాబు, హాస్టల్ వార్డెన్ లాలయ్య, ఆర్ఐ సందీప్ తదితరులు పాల్గొన్నారు.


