టీ20 వరల్డ్ కప్ భారత్‌లో ఆడం
మ్యాచ్ ప్రారంభానికి ముందే బంగ్లాదేశ్ నిర్ణయం
ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడమే కారణం!
కాకతీయ, స్పోర్ట్స్ డెస్క్: బంగ్లాదేశ్ ఆడే ఆటకు ఇచ్చే కౌంటర్లకు సంబంధం ఉండదు. అయితే 2026 టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే పలు నిర్ణయాలతో బంగ్లా క్రికెట్ బోర్డు హాట్‌టాపిక్‌గా మారింది. ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతినడంతో క్రికెట్లోనూ వివాదం ముదిరింది. బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై నేపథ్యంలో బీసీసీఐ ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్ నుంచి తప్పించగా, దానికి ప్రతి చర్యగా తమ క్రికెట్ జట్టు వచ్చే నెలలో జరగనున్న టీ20 వరల్డ్‌కప్ కోసం భారత్‌కు పంపకూడదని బంగ్లా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తమ వేదికలను భారత్‌ను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని బీసీబీ కోరింది. దీనిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.
ఐసీసీ ముందు పెద్ద ఛాలెంజ్
బంగ్లాదేశ్ విజ్ఞప్తిని అంగీకరించడం ఐసీసీకి అంత సులభం కాదు. కేవలం సామాజిక కారణాల వల్ల వేదికలను మారిస్తే భవిష్యత్తులో మిగతా దేశాలు కూడా ఇలాంటి డిమాండ్లు చేస్తాయని ఐసీసీ ఆలోచిస్తోంది. దీనివల్ల షెడ్యూల్, టికెటింగ్, బ్రాడ్‌కాస్టింగ్ ప్లాన్స్ అన్నీ తలకిందులవుతాయి. అలాగే శ్రీలంక కో హోస్ట్ అయినప్పటికీ ఒక్కసారిగా అన్ని మ్యాచులను అక్కడికి తరలించడం లాజిస్టికల్‌గా పెద్ద సమస్య. ఉద్రిక్తతలను తగ్గించాలా లేక నిబంధనల ప్రకారం ముందుకు వెళ్లాలా అనే సందిగ్ధంలో ఐసీసీ ఉంది.


