కాకతీయ, కరీంనగర్ : జిల్లాకేంద్రంలోని కపిల్ బాలకుటీర్ సీసీఐ హోమ్‌లో గురువారం స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీసీఐ హోమ్‌ను సిడబ్ల్యుసి సభ్యుడు కళింగ శేఖర్, డిసిపిఓ పర్వీన్, డిసిపియు పూదరి శాంత సందర్శించి, మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. హోమ్ నిర్వహణ తీరుపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, పరిశుభ్రతలోనే ఆరోగ్యం ఉందని అన్నారు. విద్యార్థులు లక్ష్యంతో చదివి ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కపిల్ బాలకుటీర్ ఉపాధ్యక్షుడు రాజారెడ్డి, ఇన్‌ఛార్జ్ వకుళాదేవి, కృష్ణవేణి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


