ఘనంగా కొండా సుష్మిత పటేల్ జన్మదిన వేడుకలు
కాకతీయ, గీసుగొండ: కొండా దంపతుల కుమార్తె కొండా సుష్మిత పటేల్ జన్మదిన వేడుకలు గీసుగొండ మండలంలో ఘనంగా నిర్వహించారు.మండలంలోని మరియాపురం క్రాస్ రోడ్డు వద్ద జిల్లా కాంగ్రెస్ నాయకులు, రాంపూర్ సర్పంచ్ రడం భరత్ కుమార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు.జన్మదినాన్ని పురస్కరించుకుని వలస కార్మికులకు బిర్యానీ పొట్లాలు పంపిణీ చేసి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు కొండా కుటుంబం ప్రజలతో అనుబంధాన్ని కొనసాగిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గీసుగొండ సర్పంచ్ వీరగొని రాజ్ కుమార్,నాయకులు అల్లం మర్రెడ్డి, మనుగొండ సర్పంచ్ పేర్ల శ్రవణ్,సూర్య తండా సర్పంచ్ రాఘవేంద్ర,దస్రు తండా సర్పంచ్ కేలోతు అమృత బిక్షపతి,మండల నాయకులు,వార్డు సభ్యులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.


