- రోడ్ల మరమ్మతులు వేగవంతం చేయాలి
- పునరుద్ధరణ చర్యలు చేపట్టండి
- అధికారులను ఆదేశించిన హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్
కాకతీయ, వరంగల్ బ్యూరో : వరదల ప్రభావంతో నష్టపోయిన ప్రాంతాల్లో సర్వేను త్వరగా పూర్తి చేసి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. శనివారం హనుమకొండలోని సమ్మయ్యనగర్, అమరావతి నగర్ ప్రాంతాలను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బాధితుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వరదలతో నష్టపోయిన ప్రతీ ఇంటిని తప్పకుండా సర్వే చేయాలని, నివేదిక ఆధారంగా నష్ట పరిహారం అందించేందుకు చర్యలు చేపడమని తెలిపారు. దెబ్బతిన్న రోడ్లకు తాత్కాలికంగా మరమ్మతులు చేయాలన్నారు. సమ్మయ్యనగర్, వివేక్‌నగర్, అమరావతి నగర్, టీవీ టవర్ కాలనీల్లో ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం రిటైనింగ్ వాల్స్ నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేసి ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. పారిశుధ్య నిర్వహణ వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జీడబ్ల్యుఎంసీ కాజీపేట డిప్యూటీ కమిషనర్ రవీందర్, తహసీల్దార్ రవీందర్ రెడ్డి, సీఎంహెచ్వో డాక్టర్ రాజారెడ్డి, ఆర్ అండ్ బీ డీఈలు ఉదయ్, గోపికృష్ణ, అధికారులు పాల్గొన్నారు.


