108 అంబులెన్స్ సేవలపై ఆకస్మిక తనిఖీ
అత్యవసర సేవల నాణ్యతపై సమగ్ర పరిశీలన
క్వాలిటీ కంట్రోల్ అధికారి వెంకటేశ్వర్లు
గోల్డెన్ అవర్‌లో సేవలు అందించాలని సూచన
కాకతీయ, కారేపల్లి : అత్యవసర వైద్య సేవల నాణ్యతను మెరుగుపర్చే దిశగా 108 అంబులెన్స్ సేవలపై ఆకస్మిక తనిఖీ నిర్వహించారు అని క్వాలిటీ కంట్రోల్ ఆడిటింగ్ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం సింగరేణి ప్రాంతంలో నిర్వహించిన తనిఖీలో అంబులెన్స్‌లో ఉన్న వైద్య పరికరాలు, వాహన నిర్వహణ, మందుల లభ్యత, ఆక్సిజన్ నిల్వలను సమగ్రంగా పరిశీలించారు. సేవల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు నెలవారీ కేసుల వివరాలను సేకరించారు. ప్రమాదాలు లేదా అత్యవసర పరిస్థితుల్లో బాధితులను గోల్డెన్ అవర్లోనే సమీప ఆసుపత్రులకు చేర్చడం అత్యంత ముఖ్యమని వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ మేనేజర్ నసీరుద్దీన్, సూపర్వైజర్ దుర్గాప్రసాద్, సిబ్బంది అనిత, సంపత్ పాల్గొన్నారు. అత్యవసర సేవల నాణ్యతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ తనిఖీ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.


