వరి, మొక్కజొన్న రైతులకు మద్ధతు ధర కల్పించాలి
సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కొండబోయిన నాగేశ్వరరావు
కాకతీయ, కారేపల్లి : వరి, మొక్కజొన్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. దళారీల దోపిడీ నుంచి రైతులను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. సింగరేణి మండల తహసిల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. సీపీఎం మండల కార్యదర్శి కే. నరేంద్ర అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కొండబోయిన నాగేశ్వరరావు మాట్లాడారు. పత్తి, మిర్చి నష్టాల తర్వాత రైతులు వరి, మొక్కజొన్న సాగు చేశారని తెలిపారు. పంట చేతికి వచ్చే సమయంలో కొనుగోలు కేంద్రాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వరి మాత్రమే కాకుండా మొక్కజొన్నకు కూడా బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు కనీస మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. రైతులను సమీకరించి పోరాటం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ముండ్ల ఏకాంబరం పాల్గొన్నారు. వజ్జా రామారావు, తలారి దేవప్రకాశ్ హాజరయ్యారు. పాసిని నాగేశ్వరరావు, ఈసం వెంకటేశ్వర్లు, అరేం రవి, భూక్య మల్సూర్ తదితరులు పాల్గొన్నారు.


