- ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
- ఎమ్మెల్యే కవ్వంపల్లి వెల్లడి
కాకతీయ, కరీంనగర్ : రైతులకు మద్దతు ధర అందించడం, ధాన్యం అమ్మకాల సమస్యలు లేకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపడుతోందని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఆదివారం బెజ్జంకి మండలం రేగులపల్లి, గుగ్గిళ్ల గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేయడానికి ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరను పెంచి ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాకు రూ.2,389, బోనస్‌తో కలిపి రూ.2,889 గా నిర్ణయించిందని ఆయన తెలిపారు. బీ గ్రేడ్ రకానికి క్వింటాకు రూ.2,369 మద్దతు ధరగా అందుబాటులో ఉందన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీఓ సుధీర్, ఏపీవో పర్షరాములు, బెజ్జంకి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, మండల పార్టీ అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


