కాకతీయ, కరీంనగర్ బ్యూరో : రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వీధి అమ్మకపు దారులకు తోపుడు బండ్లు పంపిణీ చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. టర్న్ రౌండ్ గ్లోబల్ సర్వీసెస్ నిర్వాహకులు అరవింద వెంకట్ కొత్తపల్లి సహకారంతో కరీంనగర్ రోటరీ ఆధ్వర్యంలో 30 మంది పేద వీధి అమ్మకం దారులకు తోపుడు బండ్లను, నలుగురు దివ్యాంగులకు వీల్ చైర్లు పంపిణీ చేశారు.
కళా భారతి ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ తో కలిసి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడారు. ప్రధానమంత్రి స్వనిధి యోజనలో భాగంగా జిల్లాలో అనేకమంది వీధి అమ్మకందారులకు గుర్తింపు లభించిందని, వారికి స్వచ్ఛంద సంస్థలు చేయూతనివ్వడం అభినందనీయమని అన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, జి.జి.హెచ్ సూపరింటెండెంట్ వీరారెడ్డి, రోటరీ క్లబ్ జిల్లా గవర్నర్ రామ్ ప్రసాద్, చైర్మన్ రమేష్ వంగల, పిడిజె డి.కె.ఆనంద్, ఏడీజే వెంకట కిషన్, జిల్లా అధ్యక్షుడు పసుల తిరుపతి, కార్యదర్శి పవన్ కృష్ణ, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


