- ఘనంగా సన్ షైన్ డాన్స్ అకాడమీ వార్షికోత్సవ వేడుకలు
కాకతీయ, కరీంనగర్ : నగరపాలక సంస్థ కళాభారతి ఆడిటోరియంలో సన్ షైన్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన 25వ వార్షికోత్సవ రాష్ట్ర స్థాయి సాంస్కృతిక పోటీలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మేయర్, బీజేపీ నేత యాదగిరి సునీల్ రావు, మాజీ కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ హాజరయ్యారు. విద్యార్థుల ప్రతిభను అభినందించారు. ఈ తరహా కార్యక్రమాలు పిల్లల్లో సృజనాత్మకతను, కళల పట్ల ఆసక్తిని పెంపొందిస్తాయని అన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు.


