డిప్యూటీ మేయర్‌గా సునీల్ రావు బాధ్యతల స్వీకరణ
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌గా ఇటీవల ఎన్నికైన యాదగిరి సునీల్ రావు బుధవారం శుభముహూర్తంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పదవీ బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ ఆయనను శాలువాతో సత్కరించి డిప్యూటీ మేయర్ కుర్చీలో కూర్చోబెట్టి అభినందనలు తెలిపారు. తన బాధ్యతల స్వీకరణ సందర్భంగా సునీల్ రావు మాట్లాడుతూ బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో, మేయర్ కొలగాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్పొరేటర్లందరినీ కలుపుకుని నగర అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. కరీంనగర్ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, మున్సిపల్ సిబ్బంది, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని సునీల్ రావుకు పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు.


