కాకతీయ, పెద్దవంగర : ఆర్థిక సమస్యలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ప్రకారం పోచారం గ్రామ శివారులోని భద్రు తండాకు చెందిన దారవత్ సోమని (42) తన ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొన్నేళ్లుగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ మద్యానికి బానిసయ్యడు. తన భర్త ఎంత చెప్పినా మద్యం మానడం లేదని ఆమె తన పుట్టింటికి ఇరవై రోజుల క్రితం వెళ్ళిపోయింది. దాంతో మనస్తాపం చెందిన అతడు సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వెంటనే వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు అతడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎస్‌ఐ ప్రమోద్ కుమార్ తెలిపారు.


