ట్రోలింగ్‌పై ఘాటుగా స్పందించిన సుదీప్ కూతురు సాన్వీ
బెంగళూరు : కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ కూతురు సాన్వీ సుదీప్ సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురయ్యారు. ఇటీవల ఆమె ఫోటోలు వైరల్ కావడంతో కొందరు నెటిజన్లు శరీర ఆకృతి, మాట్లాడే తీరుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సంగీతంపై ఆసక్తి ఉన్న సాన్వీ, మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తూ గాయనిగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. నేచురల్ స్టార్ నాని నటించిన ‘హిట్–3’ సినిమాలో పాట పాడి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ట్రోలింగ్‌పై స్పందించిన సాన్వీ, “నేను అడగనప్పుడు నా శరీరం గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు” అంటూ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెకు అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు.


