కాలి నడకతో బడి బాట పట్టిన విద్యార్థులు
కాకతీయ, నూగూరు వెంకటాపురం: బస్సు సమయానికి రాకపోవడంతో విద్యార్థులు కాలినడకన తో బడి బాట పట్టారు. ఈ ఘటన మారుమూల ప్రాంతమైన ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల పరిధిలోని సూరవీడు గ్రామం లో చోటుచేసుకుంది. ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకూ చదవాలి అంటే ఆలుబాక ఉన్నత పాఠశాలకు వెళ్ళాలి ఈ పాఠశాల దాదాపు గా 6 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది
ఈ ప్రాంతం పేరు కు ములుగు జిల్లా కానీ నియోజకవర్గం మాత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గం వాజేడు, వెంకటాపురం మండలాలు అభివృద్ధి కి ఆమడ దూరంలో ఉన్నాయి అని చెప్పకనె చెప్పవచ్చు. గత ప్రభుత్వంలో రోడ్డు పరిస్థితి ఈ ప్రస్తుత ప్రభుత్వం లో కూడా కొనసాగింది
ఇక ఈ ప్రాంతం లో ఇసుక క్వారీ లు మాత్రం అధికం కానీ రోడ్డు మాత్రం గుంతల మయం
ప్రభుత్వానికి ఆదాయ వనరులు ఉన్న కూడా అభివృద్ధి ఎందుకు అవ్వడం లేదు…..?
ఇది నిజానికి ప్రభుత్వ వైఫల్యమే అని ఇక్కడి ప్రజలు అంటున్నారు. ఈ రోడ్డు సమస్య వలన విద్యార్థులు కాలినడకన బడికి వెళ్ళే పరిస్థితి వచ్చింది అని అంటున్నారు. కేవలం రోడ్డు సరిగా ఉండి ఇసుక లారీలు వేగం తగ్గించి వెళ్తె బస్సులు సమయానికి వస్తాయని తమ పిల్లలు సమయానికి బడికి చేరుకుంటారు అని తల్లి తండ్రులు అంటున్నారు


