ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్‌లో విద్యార్థుల ప్రతిభ
మండల స్థాయిలో ప్రథమ, తృతీయ బహుమతులు సాధించిన కోరపల్లి విద్యార్థులు
కాకతీయ, జమ్మికుంట : జమ్మికుంట జిల్లా పరిషత్ హైస్కూల్‌లో నిర్వహించిన ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్‌లో కోరపల్లి జడ్‌పీహెచ్‌ఎస్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి మండల స్థాయిలో బహుమతులు సాధించారు. ఈ పోటీల్లో వి. శ్రీమాన్ ప్రథమ బహుమతి, కె. కీర్తన తృతీయ బహుమతి సాధించి పాఠశాలకు గౌరవం తీసుకువచ్చారు. విజేతలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు కేతిరి శ్రీనివాస్ రెడ్డి, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు పెండ్యం శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం అభినందించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్రీయ అవగాహన పెంపొందించుకుని సైన్స్ పట్ల ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. భవిష్యత్తులో జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా ప్రతిభ కనబరిచి ఉన్నత స్థానాలు సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల విజయంతో పాఠశాలలో ఆనంద వాతావరణం నెలకొంది.


