విద్యార్థులు ప్రతిభను వెలికితీయాలి
కాకతీయ, కరీంనగర్ : విద్యార్థుల్లో దేశభక్తి భావనను పెంపొందించడంతోపాటు ప్రపంచ దేశాలపై అవగాహన కల్పించడం ఎంతో అవసరమని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన ‘భారత గర్వాన్ని అన్వేషించండి’ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులకు దేశం పట్ల విస్తృత అవగాహన కల్పిస్తే వారి జ్ఞానం మరింతగా పెరుగుతుందని తెలిపారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయాలనే లక్ష్యంతో పాఠశాల విద్యా ప్రణాళికలో భాగంగా వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.


