విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి
కాకతీయ, దుగ్గొండి: విద్యార్థులు ప్రాధమిక దశలో అభ్యసించిన విద్య జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుందని, భవిష్యత్ లో ఉన్నత స్థాయికి ఎదగాలని కరస్పాండెంట్ గట్టికొప్పుల విజేందర్ అన్నారు. మండలంలోని రేఖంపల్లి లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ లో బుధవారం స్వయం పరిపాలన దినోత్సవం జరిగింది. అనంతరం జరిగిన సమావేశంలో కరస్పాండెంట్ గట్టికొప్పుల విజేందర్ మాట్లాడుతూ విద్యార్థులు విషయ పరిజ్ఞానం పెంపొందించుకొని పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. విద్యార్దులే ఉపాధ్యుయులై తోటి విద్యార్థులకు బోధించిన తీరు ఆకట్టుకుంది. ప్రిన్సిపాల్ గా బూరగని నేహా, ఉపాధ్యాయులుగా ముదురుకోల ప్రణయ్, మైత్రి, తరుణి, సంకీర్తన అభిలాష్, రాంచరణ్ వ్యవహారించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం రాధిక, సుప్రజ, చైతన్య, సుధాకర్, విష్ణు, జీవన్, కృష్ణ తదితరులు ఉన్నారు.


