- స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో
కాకతీయ,మహబూబాబాద్ ప్రతినిధి : గూడూరు మండల కేంద్రంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్, ఈదులపూసపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లెనిన్ వత్స టోప్పో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలోని వంట గది, డైనింగ్ హాల్, స్టాక్ రూమ్ లను పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్ తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, పాఠశాల పరిసరాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. తరగతి గదిలో విద్యార్థులతో పాఠ్యాంశాలను చదివించారు. ల్యాబ్, తరగతులను సందర్శించి, పదవ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించారు. పాఠ్యాంశాలపై ప్రశ్నలు అడిగి, వారి విషయావగహన పరీక్షించారు. ఉపాద్యాయులు షెడ్యుల్ ప్రకారం సిలబస్ పూర్తి చేసి విద్యార్థులకు ప్రతి సబ్జెక్ట్ లలో వారి నైపుణ్యాన్ని తెలుసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయాలన్నారు. పరీక్షలకు ఇప్పటి నుంచే స్పష్టమైన ప్రణాళికతో చదివి విజయం సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ రమేష్, తదితరులు పాల్గొన్నారు.


