కాకతీయ, తుంగతుర్తి : విద్యార్థులు కేవలం చదువుల్లోనే కాకుండా క్రీడారంగంలో సైతం రాణించాలని తుంగతుర్తి లయన్స్ క్లబ్ చైర్మన్ సంతోష్ అన్నారు. రీజినల్ చైర్ పర్సన్ కొండ సంతోష్ జన్మదినం సందర్భంగా ఇటీవల స్కూల్ ఫెడరేషన్ గేమ్స్ లో ఉత్తమ ప్రతిభను కనబరిచి రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపికైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి శ్రీకర్ ను మంగళవారం సన్మానించారు. ఇదే తరహాలో మంచి ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి జట్టుకు ఎంపిక కావాలని సూచించారు. రాష్ట్ర, జాతీయస్థాయిలో పాల్గొన్న విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రత్యేక హోదా ఉంటుందని తెలిపారు. క్రీడలతో మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం కలుగుతుందన్నారు.


