- అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా.వి. నరేందర్ రెడ్డి
- తైక్వాండోలో రాష్ట్ర స్థాయికి అల్ఫోర్స్ విద్యార్థి
కాకతీయ, కరీంనగర్ : జగిత్యాల జిల్లా స్థాయిలో ఇటీవల నిర్వహించిన ఎస్జీఎఫ్ తైక్వాండో పోటీల్లో అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్‌కు చెందిన 8వ తరగతి విద్యార్థిని బి.సహస్ర ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయికి ఎంపికైంది. అండర్-17 విభాగంలో సహస్ర త్వరలో మహబూబ్నగర్‌లో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా తరఫున పోటీలో పాల్గొననుంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అభినందన సభకు ముఖ్య అతిథిగా హాజరైన అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా.వి. నరేందర్ రెడ్డి మాట్లాడారు. విద్యార్థులలో చిన్ననాటి నుండి క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించాలని, క్రీడల ద్వారా నైపుణ్యాలు, నైతిక విలువలు అభివృద్ధి చెందుతాయని అన్నారు.
క్రీడలు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడతాయని, వార్షిక ప్రణాళికలో భాగంగా పాఠశాలలో క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతోందని, ప్రతిభ గల విద్యార్థులను గుర్తించి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలకు సిద్ధం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్, వ్యాయామ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు బి.సహస్రను అభినందించారు.


