కాకతీయ, జమ్మికుంట : హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలురు)లో పూర్వ విద్యార్థులే ఇప్పుడు ఉపాధ్యాయ కొలువులు నిర్వహిస్తున్నారు. చదివిన బడిలో ఉపాధ్యాయ కొలువులు నిర్వహించడం ఆనందం ఉందని ఉపాధ్యాయులు వారు అభిప్రాయ పడుతున్నారు.
ఉపాధ్యాయులు రాం. రాజయ్య, బొడిగల సమ్మయ్య, కట్కూరి వెంకట్ రెడ్డి, కొలుగురి సంపత్, మ్యాకమళ్ళ శ్రీనివాస్, వట్టేపల్లి ప్రకాష్, సంతోష్ లు జమ్మికుంట ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. ఆనాటి పూర్వ విద్యార్థులు ప్రస్తుతం పదోన్నతి పై పాఠశాల కు రావడం, ప్రస్తుతం పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా బాదం సురేష్ బాబుతో పాటు ఏడుగురు ఉపాధ్యాయులు విధులను నిర్వహించడం గమనార్హం.


