బ్యాంకింగ్‌పై విద్యార్థులకు అవగాహన
జమ్మికుంట ఎస్‌బీఐ బ్యాంకును సందర్శించిన వోక్సపోప్ పాఠశాల విద్యార్థులు
కాకతీయ, జమ్మికుంట : జమ్మికుంట పట్టణంలోని వోక్సపోప్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు బ్యాంకింగ్ వ్యవస్థపై అవగాహన పెంపొందించుకునేందుకు ఎస్‌బీఐ బ్యాంకును సందర్శించారు. 6, 7, 8 తరగతులకు చెందిన విద్యార్థులతో ఈ వినూత్న అవగాహన కార్యక్రమాన్ని పాఠశాల యాజమాన్యం నిర్వహించింది. ఈ సందర్భంగా బ్యాంకులో జరిగే నగదు లావాదేవీలు, ఖాతాలు తెరవడం, నగదు బదిలీ విధానం, రుణ సదుపాయాలు తదితర బ్యాంక్ సేవలపై విద్యార్థులకు వివరించారు. బ్యాంక్ సేవలు ప్రజలకు ఎలా ఉపయోగపడతాయో ప్రాక్టికల్‌గా అవగాహన కల్పించారు. పాఠశాల కరస్పాండెంట్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులకు చదువుతో పాటు సమాజంలో అవసరమైన అన్ని రంగాలపై సాధారణ అవగాహన కలగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. బ్యాంకింగ్ వంటి ముఖ్యమైన వ్యవస్థపై చిన్న వయస్సులోనే అవగాహన కలగడం విద్యార్థుల భవిష్యత్‌కు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ రమణ రెడ్డి, డైరెక్టర్ వెంకటరెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.


