ఉపాధ్యాయ సమస్యలపై కలెక్టర్‌కు ఎస్‌టీయూ వినతి
కాకతీయ, తొర్రూరు : ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను నూతన సంవత్సరంలో పరిష్కరించాలని ఎస్‌టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షుడు గన్నోజు ప్రసాద్, ప్రధాన కార్యదర్శి కొరవి సుధాకరాచారి కోరారు. శనివారం జిల్లా కలెక్టరేట్‌లో ఎస్‌టీయూ నూతన సంవత్సర క్యాలెండర్, డైరీలను జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆవిష్కరించారు. అనంతరం ఉపాధ్యాయ సమస్యలపై మెమోరాండం సమర్పించారు. విద్యారంగ అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పేర్కొన్న కలెక్టర్, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్‌టీయూ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.


