“పకడ్బందీగా ప్రగతి ప్రణాళిక కార్యాచరణ ”
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
కాకతీయ, రామకృష్ణాపూర్ :ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని మందమర్రి మండలం పొన్నారం గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, పారిశుద్ధ్య నిర్వహణ,సి.సి. రోడ్డు నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రజలకు త్రాగునీటి సమస్యలు లేకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అనంతరం క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలో అమృత్ 2.0 పథకంలో భాగంగా చేపడుతున్న నీటి ట్యాంకుల నిర్మాణ పనులు,పైప్ లైన్ల ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ మారుతీ ప్రసాద్,మున్సిపల్ చైర్ పర్సన్ గొడిసెల సంధ్యారాణి లతో కలిసి పరిశీలించారు. పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని,అధికారులు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


