epaper
Wednesday, April 1, 2026
epaper

గ్రామసభలతో ప్రజా పాలన బలోపేతం

గ్రామసభలతో ప్రజా పాలన బలోపేతం

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

జూన్ 2 నుంచి ‘ఇందిరమ్మ జీవిత బీమా’ అమలు

కాకతీయ, కరీంనగర్ : రాష్ట్రంలో ప్రజా పాలనను ప్రజలకు చేరువ చేసే దిశగా గ్రామసభలను సమర్థవంతంగా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యక్రమం అమలుపై మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. సీఎస్ కే. రామకృష్ణారావు సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కరీంనగర్ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ గ్రామసభల్లో ప్రజలకు అందించే సమాచారం ఒకే విధంగా ఉండాలని, ప్రభుత్వ ఉద్దేశాలు స్పష్టంగా వివరించాలని చెప్పారు. గ్రామసభలకు వార్డు సభ్యుల నుంచి ఎంపీ, మంత్రుల వరకు ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలని సూచించారు. ముఖ్యమంత్రి సందేశంతో గ్రామసభలు ప్రారంభించాలని, వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారుల పేర్లు గ్రామంలో ప్రకటించాలని తెలిపారు.
రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, గిరిజన రైతులకు ఉచిత పంపుసెట్లు వంటి పథకాలపై లబ్ధిదారుల అనుభవాలు ప్రజలకు తెలియజేయాలని అన్నారు. జూన్ 2 నుంచి ప్రారంభమయ్యే ‘ఇందిరమ్మ జీవిత బీమా’ పథకం, ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారంతో పాటు పాలు లేదా రాగి జావా అందించే కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని సూచించారు.
ప్రజల నుంచి వచ్చే సానుకూల అభిప్రాయాలను విస్తృతంగా ప్రచారం చేయాలని, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా పథకాలపై అవగాహన పెంచేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. గ్రామాల అభివృద్ధికి విడుదల చేసిన నిధులను సమర్థంగా వినియోగించాలని తెలిపారు.
గ్రామసభలకు మంచి స్పందన
సీఎస్ రామకృష్ణారావు మాట్లాడుతూ మార్చి 6 నుంచి 15 వరకు నిర్వహించిన పెండింగ్ ఫైళ్ల పరిష్కారం, పారిశుద్ధ్య కార్యక్రమాలకు మంచి స్పందన లభించిందన్నారు. అదే ఉత్సాహంతో ఏప్రిల్ 2న గ్రామసభలను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు.
ప్రతి జిల్లాలో గ్రామసభల నిర్వహణపై నివేదికలు సమర్పించాలని, ప్రజల భాగస్వామ్యం పెరగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామాల్లో అమలవుతున్న సంక్షేమ పథకాల వివరాలు ప్రజలకు తెలియజేయడంతో పాటు సమస్యలను గుర్తించి పరిష్కార మార్గాలను వివరించాలని సూచించారు.
అలాగే సాగు పద్ధతుల్లో మార్పులు, పంట మార్పిడి, యూరియా వినియోగం తగ్గింపు, ఆర్గానిక్ వ్యవసాయం వంటి అంశాలపై అవగాహన కల్పించాలని చెప్పారు. గ్రామసభల తరహాలో మున్సిపాలిటీల్లో వార్డు సభలు నిర్వహించాలని, ప్రజల అభిప్రాయాలను రికార్డు చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో జెడ్పీ సీఈవో శ్రీనివాస్, డీపీఓ జగదీశ్వర్, డీఆర్‌డీఓ శ్రీధర్, వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన

డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన అంబేద్కర్ కూడలిలో ధర్నా.. ట్రాఫిక్‌కు అంతరాయం ప్రైవేట్...

డంపింగ్ యార్డ్ రద్దు చేయాలి

డంపింగ్ యార్డ్ రద్దు చేయాలి హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ఆందోళనలకు...

కరీంనగర్‌లో చికెన్ సెంటర్లు బంద్‌కు దూరం

కరీంనగర్‌లో చికెన్ సెంటర్లు బంద్‌కు దూరం.. కాకతీయ, కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాప్...

కొండగట్టు లో అపశృతి

కొండగట్టు లో అపశృతి చలువ పందిరి కూలి భక్తులకు గాయాలు కాకతీయ, కొండగట్టు :...

“పురోగతి కాదు… తిరోగతి!” కరీంనగర్ బడ్జెట్‌పై సర్ధార్ ఫైర్

“పురోగతి కాదు… తిరోగతి!” కరీంనగర్ బడ్జెట్‌పై సర్ధార్ ఫైర్ టౌన్ ప్లానింగ్‌లో అవినీతి...

భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం

భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం పీఎంశ్రీ జడ్పీహెచ్ఎస్ కొత్తపల్లిలో ఫుడ్ ఫెస్టివల్ వైభవం సాంస్కృతిక కార్యక్రమాలతో...

లంచగొండు పంచాయతీ కార్యదర్శి..

లంచగొండు పంచాయతీ కార్యదర్శి.. ఇంద్రమ్మ ఇళ్ల పేరుతో లంచాల దందా..? రాజాపూర్ కార్యదర్శిపై...

కరీంనగర్ వంతెనపై ఘోర ప్రమాదం…

కరీంనగర్ వంతెనపై ఘోర ప్రమాదం… లారీ ఢీకొని వ్యక్తి మృతి కాకతీయ, కరీంనగర్: కరీంనగర్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img