కాకతీయ, కరక గూడెం: తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ వచ్చిన కూడా ప్రభుత్వం గ్రామాల్లో వీధి దీపాలు ఏర్పాటు చేయకపోవడం సరికాదని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రావుల సోమయ్య అన్నారు.
శనివారం మండల అభివృద్ధి అధికారి దేవవర కుమార్ వీధిలైట్లు గ్రామాల్లో వెంటనే పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున వినతి పత్రం అందజేశారు. బతుకమ్మ, దసరా వేడుకలకు గ్రామాల్లో వీధి దీపాలు లేక మహిళలు, గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో తక్షణమే వీధి దీపాలు ఏర్పాటు చేయాలని సోమయ్య డిమాండ్ చేశారు.


